భారతదేశం, జనవరి 4 -- ఓటీటీలో కొత్త వారం సందడి కాస్త తగ్గింది. ముఖ్యంగా తెలుగులో పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన మొత్తం సినిమాలు కూడా తక్కువే. ఈ వీక్ లో ఓటీటీలో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో ఈ మూడు కాస్త స్పెషల్ గా ఉన్నాయి. మరి ఈ చిత్రాలు ఏంటో ఓ సారి చూసేయండి.

సుమ కనకాల, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన సినిమా మోగ్లీ. హీరోగా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న రోషన్ చేసిన రెండో మూవీ ఇది. గతంలో బబుల్ గమ్ అని ఓ రొమాంటిక్ మూవీ చేశాడు. ఇప్పుడు మోగ్లీ అంటూ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా త్వరగానే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుని హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటించిన మోగ్లీకి కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్టర్. అడవి బ్యాక్...