భారతదేశం, డిసెంబర్ 6 -- ఈ వారం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలోకి కొత్త తెలుగు సినిమాలు వచ్చేశాయి. ఇందులో గ్రిప్పింగ్ థ్రిల్లర్లు, బలమైన పాత్రలతో కూడిన కథనాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏదైనా గ్రిప్పీ, నాస్టాల్జిక్ లేదా ఎమోషనల్ కథ కోసం చూస్తున్నారా? ఈ వారం తెలుగు ఓటీటీ లిస్ట్ లో విభిన్నమైన కథాంశాల మిశ్రమం ఉంది. రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' నుంచి 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' వరకు వీటిపై ఓ లుక్కేయండి.

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇది ఒక సంప్రదాయ ప్రేమకథా చిత్రానికి మించి, ఆధునిక సంబంధాలలోని భావోద్వేగ, మానసిక కోణాలను అన్వేషిస్తుంది. దీనిని ముఖ్యమైన, ధైర్యమైన' కథగా అభివర్ణించారు. అమ్మాయిల, అబ్బాయిల సంబంధాలు ఊపిరాడనీయకుండా ఉండకూడదని ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ చాటుతుం...