భారతదేశం, డిసెంబర్ 18 -- ఈ వారం స్ట్రీమింగ్ జాబితాలో మలయాళం, తమిళ, తెలుగు చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త బ్యాచ్‌గా వస్తున్నాయి. హృదయానికి హత్తుకునే ఆంథాలజీలు, ఫ్యామిలీ స్టోరీలు, కామెడీ వంటి అనేక రకాల జానర్‌లలో ఈ కొత్త విడుదలలను మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ లేదా టాబ్లెట్‌లో ఆస్వాదించవచ్చు.

డిసెంబర్ 19 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న థ్రిల్లర్ సిరీస్ ఫార్మా. ఇందులో నివిన్ పౌలీ, రంజిత్ కపూర్, నరైన్, బినూ పప్పు, శ్రుతి రామచంద్రన్, వీణ నందకుమార్ తదతరులు నటించారు. తన మొదటి మలయాళ వెబ్ సిరీస్‌లో నివిన్ పౌలీ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా కేపీ వినోద్ పాత్రను పోషిస్తున్నాడు. కఠినమైన ఫార్మాస్యూటికల్ రంగంలో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అందులోని సీక్రెట్స్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింద...