భారతదేశం, నవంబర్ 18 -- ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. ఇతర భాషల సినిమాలను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కారణంతో ప్రతి వారం ఓటీటీలోకి వచ్చే మలయాళ, తమిళ, కన్నడ భాషల సినిమాలపై ఓ లుక్కేస్తారు. ఈ వారం కూడా ఈ భాషల సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వీటిల్లో ఈ మూడు స్పెషల్ గా ఉన్నాయి. ఓ సారి చూసేయండి మరి.

తమిళ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా థ్రిల్లర్ 'బైసన్'. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సమాజంలోని వివక్ష, ఇతర సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా ఇది. ఇందులో ధ్రువ్ విక్రమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ డైరెక్టర్. చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ఇష్టపడే హీరో ఆసియా గేమ్స్ కు సెలెక్ట్ అవుతాడు. కానీ మ్యాచ...