భారతదేశం, నవంబర్ 10 -- కొత్త వారం వచ్చిందంటే ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్ లు వచ్చి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా ఓటీటీలోకి చాలా సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. వీటిల్లో ఈ నాలుగు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ చాలా స్పెషల్ గా ఉన్నాయి. అవేంటో ఓ సారి చూసేయండి.

ఓటీటీలో పాపులర్ అయిన సిరీస్ ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ నుంచి ఇప్పుడు సీజన్ 3 వచ్చేస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. షెఫాలీ షా ప్రశంసలు పొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా కొత్త సీజన్ లో డిఐజి వర్తికా చతుర్వేదిగా తిరిగి వచ్చింది. ఇది వదిలేస్తున్న శిశువుల, అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసు చుట్టూ తిరుగుతుంది.

జాలీ ఎల్ ఎల్ బి అంటూ కామెడీ సందడి చేశాడు అక్షయ్ కుమార్. ఈ మూవీ పార్ట్ 3 ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టనుంది. జాలీ ఎల్ ...