భారతదేశం, జూలై 22 -- కొత్త వారం వచ్చిందంటే సినిమాలు ఓటీటీలోకి వరుస కడుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు ఒకే ఒక్క డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షో టైమ్ (Show Time) ఓటీటీ రిలీజ్ మాత్రమే కన్ఫామ్ అయింది. మిగతా తెలుగు సినిమాలేవీ ఓటీటీ రిలీజ్ ప్రకటనలు ఏవీ చేయలేదు.

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన షో టైమ్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో రిలీజ్ కానుంది. జులై 25న ఈ సినిమా సన్ నెక్ట్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీలో నవీన్ చంద్ర లీడ్ రోల్ ప్లే చేశాడు. రాజా రవీంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్ లాంటి వాళ్లూ నటించారు.

షో టైమ్ మూవీ 21 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుండటం గమనార్హం. ఈ మూవీ జులై 4న థియేటర్లలో రిల...