భారతదేశం, జూలై 15 -- ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, సిరీస్ లు దూసుకొస్తున్నాయి. ఇందులో సూపర్ హిట్ సినిమాలు, అదరగొట్టే సిరీస్ లు ఉన్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్ లు కలిపి ప్రైమ్ వీడియోలో ఆరు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వివిధ భాషల్లోని ఆ సినిమాలు, సిరీస్ లు ఏంటో ఓ సారి చూసేద్దాం.

బాక్సాఫీస్ ను షేక్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. లక్ష కోట్ల క్రైమ్ థ్రిల్లర్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. బిచ్చగాడిగా ధనుష్ యాక్టింగ్ తో అదరగొట్టారు. మాజీ సీబీఐ ఆఫీసర్ గా నాగార్జున గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను చాలా ఈజ్ తో చేసేశారు. ఈ మూవీలో రష్మిక మందన్న కూడా కీ రోల్ ప్లే చేసింది. థియేటర్లలో సత్తాచాటిన ఈ థ్రిల్లర్ మూవీ జూలై 18 నుంచి అమెజాన్ ప్ర...