Hyderabad, ఏప్రిల్ 23 -- ఎండల్లో వేడికి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. మండే ఎండలు, వేడి గాలులు శరీరాన్ని వేడెక్కిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఇక మే నెలలో మండి పోవడం ఖాయం. వేసవి కాలంలో సర్వసాధారణమైన సమస్య వడదెబ్బ.

వడదెబ్బ అంటే చిన్న విషయంలాగే కనిపిస్తుంది. కానీ ఇది తీవ్రమైన పరిస్థితి. దీనిని వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే ప్రమాదకరంగా మారుతుంది. అధిక వేడి శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది. ఇది మనకు మైకము, అలసట లేదా ఆందోళన కలిగిస్తుంది. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రాణంతకంగా మారతుుంది.

అందువల్ల, వడదెబ్బ లక్షణాలను గుర్తించి సరైన సమయంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం. హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.

వడదెబ్బకు గురైన వ్యక్తిలో కనిపించే మొదటి లక్షణం అధిక జ్వరం. ఎవరైనా వడదెబ్బక...