భారతదేశం, జూన్ 27 -- ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ కు మంచి అనుభూతిని అందించి.. పాపులర్ వెబ్ సిరీస్ ల్లో ఒకటిగా నిలిచిన స్క్విడ్ గేమ్ నుంచి లాస్ట్ సీజన్ వచ్చేస్తోంది. ఈ రోజే (జూన్ 27) నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం నుంచే స్ట్రీమింగ్ కానుంది. మరి ఇండియాలో ఈ సిరీస్ ను ఏ టైమ్ కు చూడొచ్చంటే?

థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. అమెరికాలో అర్ధరాత్రి 12 గంటలకు ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. దీని ప్రకారం ఇండియాలో ఈ పాపులర్ వెబ్ సిరీస్ ను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి చూడొచ్చు. మధ్యాహ్నం నుంచి ఇండియాలోని ఆడియన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ చూసే అవకాశముంది. ఇంకెందుకు లేటు ఈ సిరీస్ ను వీక్షించేందు...