భారతదేశం, మే 16 -- గురువారం నిఫ్టీ 50 ఇండెక్స్ 1.6 శాతం లాభంతో 25,062.10 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 1.01 శాతం పెరిగి 55,355.60 వద్ద ముగిసింది. మెటల్స్ రియాల్టీ, ఆటో, ఐటీ ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. విస్తృత సూచీల్లో స్మాల్ క్యాప్ 0.5 శాతం, మిడ్ క్యాప్ 0.74 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ 50 ఇండెక్స్ కు శుక్రవారం 24,900, 24,750 కీలక మద్దతు జోన్లుగా పనిచేస్తాయి, 25,210-25,300 బుల్స్ కు కీలక నిరోధక స్థాయిలుగా పనిచేస్తాయి. అయితే 24,750 దిగువన అప్ ట్రెండ్ బలహీనంగా మారుతుందని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. మరోవైపు బ్యాంక్ నిఫ్టీకి తక్షణ అడ్డంకి 55,500 వద్ద, ప్రధాన మద్దతు 53,480 వద్ద ఉందని అసిత్ సి మెహతాలోని ఎవిపి టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హృషికేష్ యడ్వే అన్నారు.

ట్రంప్...