Hyderabad, జూలై 11 -- జ్యోతిష్య శాస్త్రంలో రాశి, పుట్టిన తేదీ లేదా పుట్టిన వారం వంటి వాటి ఆధారంగా ఆ వ్యక్తి ఎలా ఉంటారు వంటి విషయాలను చెప్పవచ్చు. వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా వీటి ఆధారంగా చెప్పవచ్చు. అయితే, ఆదివారం నుండి శనివారం వరకు ఏ రోజు పుట్టారు అనే దాని ప్రకారం ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు.

జ్యోతిష్యం సహాయంతో వారంలో ఏ రోజు పుడితే వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. సోమవారం నాడు పుట్టిన వ్యక్తులు ఎలా ఉంటారనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మీరు కూడా సోమవారమే పుట్టారా? అయితే మీ గురించి కూడా మీరు ఇక్కడ తెలుసుకోండి.

సోమవారం నాడు పుట్టిన వ్యక్తులు ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. ఈ రోజు పుట్టిన వారు స్నేహపూర్వకంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. చాలా ఎమోషనల్‌గా, సెన్సిటివ్‌గా ఉంటారు. వీరి హృదయం చాలా మృదువైనది. ఎవరి బాధ...