భారతదేశం, మే 23 -- జాగృతి రైలు ప్రధాన ఉద్దేశ్యం వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం. ఈ రైలులో ప్రయాణించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలు.. అలాగే స్ఫూర్తిని పొందవచ్చు. ప్రయాణంతో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు. అయితే ఈ రైలులో ఎలా ప్రయాణించాలి.. టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రైలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. దీంట్లో ప్రయాణానికి 500 మందిని మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణంలో యువతకు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన మెళకువలు నేర్పిస్తారు. కేవలం 15 రోజుల్లో ఈ రైలు సుమారు 8000 కిలోమీటర్లు నడుస్తుంది.

ఈ రైలు ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. మొదటి స్టాప్ అహ్మదాబాద్.. ఆ తర్వాత ముంబై, బెంగళూరు మీదుగా మధురై చేరుకుంటుంది. అక్కడి నుండి ఒడిశాలోకి ప్రవేశించి.. మధ్య భారతదేశం ద్వారా తిరిగి ఢిల్లీకి చేర...