భారతదేశం, జూలై 5 -- భారత మార్కెట్​లో ఇటీవల కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. ఒప్పో తమ ప్రసిద్ధ కెమెరా-కేంద్రీకృత రెనో సిరీస్‌లో రెనో 14 ప్రో, రెనో 14 5G మోడళ్లను తీసుకొచ్చింది. మరోవైపు నథింగ్​ ఫోన్​ 3 కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఒప్పో రెనో 14 ప్రోని నథింగ్​ ఫోన్​ 3తో పోల్చి.. ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఒప్పో రెనో 14 ప్రో దాని మునుపటి మోడళ్లలో చూసిన ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌ను కొనసాగిస్తుంది. అయితే, ఇది కొన్ని మార్పులతో వస్తుంది. రేర్​ కెమెరా మాడ్యూల్ మరింత వెడల్పుగా ఉండటంతో పాటు ఫ్రేమ్‌లో 100% రీసైకిల్ చేసిన అల్యూమినియంను ఉపయోగించారు. రేర్​ ప్యానెల్‌కు టెక్స్‌చర్ జోడించే "వెల్వెట్ గ్లాస్" అనే కొత్త మెటీరియల్‌ను కూడా ఇందులో వాడారు.

మరోవైపు, నథింగ్ ఫోన్ 3 ప్రత్యేకమైన డిజైన్ అంశాలపై దృష్టి పెట్టింది. ఇది గతంలో ఉన్న గ్లిఫ్ ఎల...