భారతదేశం, డిసెంబర్ 16 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పరిశ్రమ వేగంగా రూపాంతరం చెందుతోంది. పాత బ్రాండ్‌లతో పాటు స్వదేశీ స్టార్టప్‌లు కూడా ఇప్పుడు ప్రీమియం స్పోర్ట్స్ సెగ్మెంట్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యమహా ఏరాక్స్​ ఈని ఏథర్​ 450 ఏపెక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​తో పోల్చి, ఈ రెండింటిలో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? దేని రేంజ్​ ఎంత? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

యమహా ఏరాక్స్ ఈ.. పెట్రోల్ వెర్షన్ అయిన ఏరాక్స్ 155 డిజైన్‌ను యథాతథంగా కొనసాగిస్తూ, ఒక పవర్ఫుల్ మ్యాక్సీ-స్కూటర్ లుక్‌లో కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఎత్తైన ఫ్రంట్ ఏప్రాన్, శక్తివంతమైన ట్విన్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, మధ్యలో వెడల్పుగా ఉండే ఫ్లోర్‌బోర్డ్ టన్నెల్ ఉన్నాయి. ఈ డిజైన్​, యమహా స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ వారసత్వాన్ని బలంగా ప్రతిబింబిస్తుంది....