Hyderabad, ఆగస్టు 8 -- మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'సయ్యారా'.. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది. కొత్త నటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన ఈ సినిమా.. ఈ ఏడాది అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ ప్రశంసల మధ్య, ఈ సినిమా కొరియన్ క్లాసిక్ 'ఎ మూమెంట్ టు రిమెంబర్' నుండి కాపీ చేసిందని కొంతమంది ప్రేక్షకులు ఆరోపించడంతో ఒక వివాదం మొదలైంది.

సయ్యారా మూవీ నిజంగానే కాపీ చేశారా? తాజాగా సినిమా రచయిత సంకల్ప్ సదనా మొదటిసారిగా ఈ విమర్శలపై స్పందించాడు. ట్రేడ్ ఎనలిస్ట్ కోమల్ నాహ్తాతో మాట్లాడిన సంకల్ప్, ఈ కాపీ ఆరోపణలను కొట్టిపారేశాడు.

"నిజానికి, దీని గురించి ఇప్పటికే చాలా మాట్లాడారు. నేను చెప్పగలిగిందల్లా ఒకటే. కొరియన్ సినిమా ఇప్పటికే వచ్చింది. 'సయ్యారా' కూడా ఉంది. రెండింటిని చూసి మీ...