భారతదేశం, డిసెంబర్ 15 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) హైదరాబాద్‌తోపాటుగా పలు ప్రాంతాలకు నడిపే సర్వీసుల టికెట్ ధరలపై డిస్కౌంట్లు ప్రకటించింది. సంక్రాంతి సమయంలో ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు ఈ తగ్గింపు ఎంతగానో ఉపయోగపడనుంది. ఎక్కువ ప్రయాణం చేయండి, తక్కువ పే చేయండి అంటూ టీజీఎస్ఆర్టీసీ చెబుతోంది. స్పెషల్ డిస్కౌంట్లు ఉపయోగించుకోవాలని అంటోంది.

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే అనేక బస్సులపై ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. సంక్రాంతికి వెళ్లడం, తిరిగి వచ్చే ప్రయాణికులకు ఈ డిస్కౌంట్లు చాలా ఉపయోగపడతాయి. రాజధాని, గరుడ ప్లస్‌పై 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ. అలాగే డిలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీపై 15 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ బస్సులు పలు రూట్లలో వెళ్లనున్నాయి.

కోదాడ విజయవాడ, హైదరాబాద్-రాజమండ్రి వయా విజయవాడ...