Hyderabad, జూన్ 14 -- చాలా మంది ఏ సమస్య ఉండకూడదని రత్నాలను, రంగురాళ్లను ధరిస్తూ ఉంటారు. వీటి వలన సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు. వాటిలో రూబీ కూడా ఒకటి. రూబీ సూర్య గ్రహానికి సంబంధించినది. సూర్యుడు ఆత్మవిశ్వాసం, కీర్తి, విజయం, ఆరోగ్యాన్ని అందిస్తాడు. ఒకరి జాతకంలో సూర్యుడు స్థానం బలహీనంగా ఉంటే వారు విజయాన్ని సాధించలేరు.

ఆత్మవిశ్వాసం కూడా వారికి తక్కువగా ఉంటుంది. కీర్తి రాదు. ఆరోగ్యం కూడా ఉండదు. రత్న శాస్త్రం ప్రకారం అటువంటివారు రూబీని ధరించడం వలన సమస్యలు ఏమీ ఉండవు.

జ్యోతిష్య నిపుణులు, రూబీని ధరించడం వలన కలిగే లాభాలను వివరించారు. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాల్లో ఉన్నవారు రూబీ రత్నాన్ని ధరిస్తే విజయాన్ని, అనేక అవకాశాలని పొందవచ్చు. ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కీర్తిని పొందవచ్చు.

మ...