భారతదేశం, ఫిబ్రవరి 12 -- మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమాని అయితే.. కొన్ని ప్రత్యేకమైన, ఎడిషన్ల కోసం చూస్తున్నట్లయితే, షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ మీకు గొప్ప అవకాశం. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐకాన్ మోటార్ స్పోర్ట్స్‌తో జతకట్టి ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 100 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో కేవలం 25 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో కేవలం 25 పరిమిత బైక్‌లు మాత్రమే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 100 యూనిట్లు ఉత్పత్తి చేస్తారు. కేవలం 25 మంది కస్టమర్లు మాత్రమే భారత్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ కొనాలనుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన కేటాయిస్తారు. డిమాండ్ దృష్ట్యా త్వరలోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ బైక్ అత్యంత ప్...