భారతదేశం, జనవరి 14 -- మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఎకో' మూవీపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ హీరో ధనుష్ ఈ సినిమాపై మనసు పారేసుకున్నారు. ఇదో మాస్టర్ పీస్ అంటూ తన రివ్యూను పోస్టు చేశారు. ఎకో చిత్రంలో కీలక పాత్ర పోషించిన బయానా మోమిన్ నటనను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. మీరు ఈ మూవీని ఏ ఓటీటీలో చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

స్టార్ హీరో ధనుష్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఎకోపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. 'ఎకో'ను 'మాస్టర్‌పీస్'గా అభివర్ణించారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఈ హీరో ఎకో సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి బయానా మోమిన్ నటనను ప్రత్యేకంగా అభినందించారు. ''మలయాళ చిత్రం 'ఎకో' ఒక మాస్టర్‌పీస్. నటి బయానా మోమిన్ అన్ని అత్యున్నత గౌరవాలకు అర్హురాలు. ప్రపంచ స్థాయి నటన'' అని ఎక్స్ లో ధనుష్ పోస్టు చేశారు.

మలయాళ బ...