Hyderabad, ఆగస్టు 20 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. రాహువు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. రాహువు సంచారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి రాహువు సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తే, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను తీసుకువస్తుంది.

రాహువు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తుండగా, 2025 డిసెంబర్ 4 వరకు కుంభ రాశిలో ఉంటాడు. వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాహువు కుంభ రాశి సంచారం మొత్తం 12 రాశులపై అనుకూలమైన, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కుంభ రాశిలో రాహువు రావడంతో కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. డిసెంబర్ 4 వరకు ఈ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

కుంభ రాశిలో రాహువు సంచారం మేష రాశి వారికి మ...