Hyderabad, అక్టోబర్ 8 -- జన్మనిచ్చిన తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరూ కూడా తల్లిని ఎక్కువగా ప్రేమిస్తారు. తల్లి బాధపడితే చూడలేరు. కానీ చాలా తక్కువ మంది మాత్రం తల్లి చెప్పినవి చేయరు, తల్లి చెప్పిన దానికి విరుద్ధంగా మాట్లాడటం వంటివి చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తల్లిని ఎక్కువగా ఇష్టపడతారు. తల్లి పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉంటారు. పైగా మొట్టమొదట అందరికంటే ఎక్కువ ఇష్టపడేది తల్లినే. తల్లి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు.

మరి ఏ రాశుల వారు తల్లి కోసం ఏమైనా త్యాగం చేయగలరు, ఆ రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం ఒక విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు మాత్రం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశుల వారికి తల్లి అంటే చాలా ఇష్టం, అమ్మపై ఎక్కువ ...