భారతదేశం, ఏప్రిల్ 10 -- ఆచార్య చాణక్యుడు విధానాలు ఎప్పటికీ పాటించదగినవే. చాణక్యుడు చెప్పిన 200కు పైగా సూత్రాలలో మనిషి జీవితాన్ని ప్రతిబింబించేవే అన్నీ. జీవితంలో ఎలాంటి వ్యక్తులు విజయం సాధిస్తాడో చాణక్యుడు తన నీతి సూత్రాలలో వివరించాడు.

ఆచార్య చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని కాలంలో జీవించేవాడు. నంద రాజవంశం పతనంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు అని చెప్పుకుంటారు. అలాగే ఐక్య భారతదేశ సృష్టిలో కూడా చాణక్యుడు ముఖ్యమైన వ్యక్తి అని అంటారు. చరిత్రకారులు చెబుతున్న ప్రకారం ఆచార్య చాణక్యుడు విధానాల కారణంగానే మౌర్య సామ్రాజ్యం మగధను ఎంతో కాలం పాలించిందని అంటారు.

ఆచార్య చాణక్యుడు ఎన్నో రచనలను చేశాడు. అందులో నీతి శాస్త్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పొందుపరిచాడు. మీరు మీ జీవితంలో ఎల్లప...