Hyderabad, ఏప్రిల్ 25 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది మరో హిట్ వచ్చినట్లే కనిపిస్తోంది. తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 25) థియేటర్లలో రిలీజైన తుడరుమ్ (Thudarum) సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తెలుగులోనూ ఇదే టైటిల్ తో రిలీజైన ఈ సినిమాలో మోహన్‌లాల్ నటన సూపర్ అంటూ అభిమానులు, రివ్యూయర్లు చెబుతున్నారు.

మోహన్ లాల్ ఈ ఏడాది ఇప్పటికే ఎల్2: ఎంపురాన్ తో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాను అందించాడు. ఈ మూవీ ఈ మధ్యే జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. ఇక ఇప్పుడు తుడరుమ్ కు కూడా అలాంటి రివ్యూలే వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామాతోపాటు రివేంజ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులోనూ ఇదే అర్థం కాని టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారన్న విమర్శలు వచ్చినా.. మూవీ చూసిన తర్వాత మాత్రం ప్రేక్షకులు మంచి రివ్యూలు ఇచ్చారు.

తరుణ్ మూర్తి డై...