Hyderabad, జూలై 22 -- మలయాళం పోలీస్ థ్రిల్లర్ మూవీ రోంత్ (Ronth). మంగళవారమే (జులై 22) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.10 కోట్లు వసూలు చేసిన ఈ చిన్న సినిమా.. ఒక్క రాత్రిలోనే జరిగే స్టోరీ. రాత్రి గస్తీ చేసే ఇద్దరు పోలీసుల చుట్టూ తిరుగుతుంది. కథ, కథనంతోపాటు వాళ్ల నటన ఈ సినిమాకు హైలైట్ గా చెప్పొచ్చు.

మలయాళం థ్రిల్లర్ మూవీ రోంత్ గత నెల 13న థియేటర్లలో రిలీజై మంచి హిట్ సాధించింది. రోంత్ అంటే ప్యాట్రోలింగ్ అని అర్థం. రాత్రిపూట గస్తీ నిర్వహించే కానిస్టేబుల్ దిన్నాథ్ (రోషన్ మాథ్యూ), ఎస్ఐ యోహనన్ (దిలీష్ పోతన్) చుట్టూ తిరిగే కథ ఇది. మాజీ పోలీస్ అధికారి అయిన షాహి కబీర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. దీంతో రాత్రి గస్తీ నిర్వహించే పోలీసుల జీవితాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లుగా వివరించడంలో సక్సెస్ సాధించాడు. ...