Hyderabad, మే 9 -- మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ జావా (Operation Java). తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. నిజ జీవితంలో జరిగిన సైబర్ నేరాలను తీసుకొని వాటిని ఎలా పరిష్కరించారో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్, యూట్యూబ్ లలో హిందీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళం మూవీ ఆపరేషన్ జావా దేశం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన సవాళ్ల గురించి చర్చించింది. అందులో ఒకటి సైబర్ నేరాలు కాగా.. మరొకటి దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న వారి కష్టాలను కూడా కళ్లకు కట్టింది.

కొచ్చిలోని ఓ సైబర్ క్రైమ్ సెల్ ఏడాదిన్నర వ్యవధిలో పరిష్కరించిన వివిధ నిజ జీవిత సైబర్ నేరాల చుట్టూ తిరిగే మూవీ ఇది. ఈ నేరాలను ఇద్దరు ఇ...