భారతదేశం, డిసెంబర్ 12 -- ఈ మంచు కురిసే వేళలో పాపికొండల అందాలను చూడాలనుకుంటున్నారా..? గోదావరి అలలపై వివాహరిస్తూ సాగే అద్భుతమైన జర్నీని అస్వాదించాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ డిసెంబర్ నెలలోనే జర్నీ తేదీలున్నాయి.

భద్రాచలం - పాపికొండలు నాన్ ఏసీ ప్యాకేజీ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ నెలలో చూస్తే... 12, 19, 26 తేదీల్లో ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... పెద్దలకు రూ.6,999, పిల్లలకు రూ.5,599గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం https://tgtdc.in/ వెబ్ సైట్ చూడొచ్చు. 180042546464 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా సంప్రద...