భారతదేశం, డిసెంబర్ 16 -- వారంలో ప్రతి రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం నాడు చూస్తే హనుమంతుని పూజిస్తారు. మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించడం వలన హనుమంతుని ఆశీస్సులు కలిగి ఆనందంగా ఉండొచ్చు. హనుమంతుడి అనుగ్రహంతో భయమంతా తొలగి, విజయవంతంగా పనులను పూర్తి చేయొచ్చు. మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించేటప్పుడు చాలా మంది హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తారు.

అయితే మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించేటప్పుడు కొన్ని పరిహారాలను కూడా పాటించడం మంచిది. ఈ సులువైన పరిహారాలను మంగళవారం నాడు పాటించడం వలన జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు ఇవేమీ ఉండవు. ఆనందంగా పనులు పూర్తవుతాయి, సక్సెస్‌ను కూడా అందుకోవచ్చు.

మంగళవారం నాడు హనుమంతుని ఆరాధించేటప్పుడు ఈ పరిహారాలను కూడా పాటిస్తే మంచిది. మంగళవారం నాడు ఏ సమస్యలైనా తొలగిపోవడానికి ఈ చి...