Hyderabad, జూన్ 5 -- పంచాయత్ వెబ్ సిరీస్ మేకర్స్ మరోసారి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. గతేడాది మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీ రివీల్ చేయడానికి సొరకాయల ప్రయోగం చేసిన వాళ్లు.. ఇప్పుడు ఓటు వేయండంటూ మరో ఆఫర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముందు చెప్పిన జులై 2 కంటే ముందే ఈ పంచాయత్ 4వ సీజన్ చూడాలనుకుంటే ఇలా చేయండంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్ (Panchayat). ఇప్పుడు నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జులై 2న తీసుకురానున్నట్లు గతంలోనే మేకర్స్ వెల్లడించారు. కానీ గురువారం (జూన్ 5) ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేస్తూ.. ముందే తీసుకురానున్నట్లు హింట్ ఇచ్చారు.

అయితే అలా జరగాలంటే అది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. అద...