భారతదేశం, జూలై 17 -- మహిళలకు సేవింగ్స్‌ అకౌంట్‌తో క్యాన్సర్‌ చికిత్సలను అందించే ఆరోగ్య బీమా అందించే పథకాన్ని కెనరా బ్యాంకు ప్రారంభించింది. కెనరా ఏంజెల్‌ పేరిట గత ఏడాది ప్రారంభించిన ఈ పథకంతో ఖాతాదారులకు లక్షల రుపాయల విలువైన క్యాన్సర్‌ చికిత్సల బీమా లభిస్తుంది.

ఇటీవలి కాలంలో మహిళలు రకరకాల క్యాన్సర్ల బారిన పడుతుండటం, వాటి చికిత్సలు తలకు మించిన భారంగా మారుతుండటంతో సేవింగ్స్ అకౌంట్లతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రవేశపెట్టారు. రూ.5వేల రుపాయల క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్‌ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.దీనికి అదనంగా ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే క్యాన్సర్‌ చికిత్సల్లో ఆరోగ్య రక్షణ పొందవచ్చు.

కెనరా ఏంజెల్‌లో సేవింగ్స్‌ ఖాతాదారులకు అన్ని రకాల క్యాన్సర్‌ చికిత్సలకు బీమా సదుపాయం లభిస్తుంది. కెనరా ఏంజెల్‌ అకౌంట్స్‌ ఖాతాదారుల భర్త, పిల్లలకు ...