భారతదేశం, ఆగస్టు 31 -- ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ వచ్చేసింది. సండే స్పెషల్ గా ఈ రోజు (ఆగస్టు 31) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. విలక్షణ నటుడు అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్ ప్లే చేశాడు. లెక్కల మాస్టర్ గా నటించాడు. మ్యాథ్స్ అంటే భయపడే ఓ స్టూడెంట్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఎలా ఎదిగిందనే కథతో ఈ ఫిల్మ్ తెరకెక్కింది.

ఈటీవీ విన్ ఓటీటీలో ప్రతి ఆదివారం కథా సుధాలో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సండే ఒక్కో షార్ట్ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంది. ఈ సండే 'లెక్కల మాస్టర్' ఓటీటీలో రిలీజైంది. ఈ షార్ట్ ఫిల్మ్ లో అవసరాల శ్రీనివాస్, సహస్ర శ్రీ, సుమశ్రీ మదిర కీలక పాత్రలు పోషించారు.

సహస్రకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే భయం. ఫార్ములాలు, లెక్కలు అంటే వణికిపోయేది. కానీ ఆ స్కూల్ కు లెక్కల టీచర్ గా మల...