Hyderabad, ఆగస్టు 31 -- కుశ్ లవ్, తన్మయి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మయూఖం. డైరెక్టర్ వెంకట్ బులెమోని దర్శకత్వం వహించిన ఈ సినిమాను భారీ పాన్ ఇండియా మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీమతి శ్రీలత వెంకట్ మయూఖం సినిమాను నిర్మిస్తున్నారు.

ఇటీవల మయూఖం మూవీ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం మయూఖం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత రాంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే, అతిథులుగా వచ్చిన సెలబ్రిటీలు కూడా ఆసక్తికర వాఖ్యలు చేశారు.

అతిథిగా వచ్చిన హీరో, ప్రొడ్యూసర్ రాంకీ మాట్లాడుతూ.. "డైరెక్టర్ వెంకట్ గారు చాలా టాలెంటెడ్. ఆయన మయూఖం చిత్రంతో ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. మీలో ఎవరైనా స్టార్ కావొచ్చు. స్టార్ అయ్యాక డైరెక్టర్ వెంకట్ గారు చేసిన ...