భారతదేశం, జనవరి 26 -- తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును జనవరి 28న ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుందని వెల్లడించారు.

కేంద్రం నుంచి అదనపు నిధులను సమీకరించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి అవకాశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీల మంజూరు, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత తీసుకుని ప్రస్తావించాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను సమర్పించామని, కేంద్రం నుంచి ఇంకా రూ.12,000 కోట్లు రావాల్సి ఉందని...