భారతదేశం, ఏప్రిల్ 18 -- మీరు మంచి క్రేజీ స్పోర్ట్స్ బైక్ కొనాలని కలలు కంటుంటే ఇది మీకు సరైన అవకాశం. ఎందుకంటే కవాసాకి తన పాపులర్ సూపర్ బైక్ జెడ్900పై ఏప్రిల్ 2025లో 40,000 డిస్కౌంట్ ఆఫర్‌ను కొనసాగించింది. ఇది బైక్ ప్రియులకు పెద్ద గిఫ్ట్ లాంటిది అన్నమాట. మీరు ఈ బైక్ పొందాలనుకుంటే సమీప డీలర్‌షిప్‌ వెళ్లి వెంటనే బుక్ చేసుకోండి.

కవాసాకి జెడ్900 ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.9.38 లక్షలు. అయితే ఈ డిస్కౌంట్ తర్వాత బైక్ ధర రూ.8.98 లక్షలకు దిగొచ్చింది. ఈ ఆఫర్ 31 మే 2025 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు వర్తిస్తుంది.

జెడ్ 900 భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, సరసమైన ఇన్లైన్-ఫోర్ నేకెడ్ సూపర్ బైక్లలో ఒకటి. మొదటిసారి పెద్ద ఇంజిన్ స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునే రైడర్లలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఈ బైక్ బలమైన ఇంజిన్, అద్భుతమైన పనితీరును కలిగి ఉంది. ఇందుల...