Hyderabad, జనవరి 31 -- మసూర్ పప్పును మనం ఎర్ర కందిపప్పు అని పిలుచుకుంటాము. దీన్ని కూడా అధికంగానే తింటూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన పప్పు దినుసే. అయితే కొన్ని కులాల వారు, బెంగాలీలు ఈ మసూర్ పప్పును మాంసాహారంగా భావిస్తారు. దీన్ని తింటే మాంసాహారం తిన్నట్టే అనుకుంటారు. అందుకే కొంతమంది ఈ పప్పును తినరు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో ఈ మసూరు పప్పును పూర్తి మాంసాహార జాబితాలో కలిపేశారు. ఇలా ఎందుకు చేశారో తెలుసుకోండి. మసూర్ పప్పుకు మహాభారతానికి కూడా ఒక అనుబంధం ఉన్నట్టు బెంగాలీలో చెప్పుకుంటారు.

పశ్చిమ బెంగాల్‌లో మసూర్ పప్పును మాంసాహారంగా భావించడానికి ఒక కారణం చెప్పుకుంటూ ఉంటారు. సహస్రబాహు అర్జునుడు అని పిలిచే రాజు జమదగ్ని దగ్గర ఉన్న కామధేనువును దొంగిలిస్తాడు. ఆ కామధేనువును రాజు బలవంతంగా ఈడ్చుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆవుకు గాయాలు తగిలి రక్తస్రావం అవుతుంది. ఆ ...