భారతదేశం, జూన్ 26 -- బరువు తగ్గడం అనేది నిజంగానే కష్టమైన ప్రయాణం. వ్యాయామాలు, జీవనశైలి మార్పులు, కేలరీలు తక్కువగా ఉండే ఆహారం.. వీటన్నిటిలోనూ నిలకడగా ఉండాలి. అయితే, వీటన్నింటినీ పక్కన పెట్టి ఒక ముఖ్యమైన పనిని చేయకపోతే, బరువు తగ్గడం పది రెట్లు కష్టమవుతుందని వెయిట్ లాస్ కోచ్ అన్-మరియా టామ్ చెబుతున్నారు. జూన్ 24న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక పోస్ట్‌లో, ఆమె బరువు తగ్గించే ప్రయాణంలో మనం మిస్ చేయకూడని ఒక అడుగు గురించి మాట్లాడారు. "మీరు ఈ ఒక్క పని చేయకపోతే, పొట్ట కొవ్వు తగ్గించడం 10 రెట్లు కష్టం" అని వివరించారు. అది ఏంటో తెలుసుకుందామా?

ఈ వెయిట్ లాస్ కోచ్ ప్రకారం భోజనం తర్వాత నడవడం అలవాటు చేసుకోకపోతే కొవ్వు తగ్గించే ప్రయాణం మరింత కష్టమవుతుంది. "మీరు కొవ్వును తగ్గించే ప్రయాణంలో ఈ విషయాన్ని వదిలేస్తే, బరువు తగ్గడం 10 రెట్లు కష్టమవుతుంది. మీకు కఠి...