భారతదేశం, మే 19 -- వరంగల్‌ రైల్వే స్టేషన్‌ ఈ నెల 22న పునః ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా.. కాకతీయుల చరిత్రాత్మక కళ ఉట్టిపడేలా.. ఈ స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దారు.

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద రూ.25.41 కోట్ల అంచనా వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ కాజీపేట-విజయవాడ రైలు మార్గంలో ఉంది. న్యూఢిల్లీ, చెన్నై, విజయవాడ, సికింద్రాబాద్‌లను కలుపుతుంది. ప్రతిరోజు సుమారు 137 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. సగటున 31,887 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు.

అభివృద్ధిలో భాగంగా.. స్టేషన్ ముఖభాగాన్ని కాకతీయ కళా తోరణం శైలిలో మారుస్తున్నారు. 12 మీటర్ల వెడల్పుతో 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లత...