Andhrapradesh,telangana, జూలై 5 -- భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుందని తెలిపింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం కార్యక్రమాల కారణం. రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జూలై 14, 15వ తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వివరించిందియ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించవలసినదిగా భక్తులను కోరింది.

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరి...