భారతదేశం, మే 12 -- దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇవి చాలా ప్రత్యేకం అని పెద్దలు చెబుతున్నారు. దీంతో తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రతిరోజూ దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది వరకు భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు.. ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక్కడికి పుష్కరాలకు వచ్చే భక్తులు హెలికాప్టర్‌లో విహరించేందుకు జాయ్‌రైడ్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు (కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి) ఉన్న పుణ్యక్షేత...