Telangana, జూన్ 15 -- స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని చెప్పారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయన్నారు.

స్థానిక ఎన్నికలపై రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీ పై స్పష్టత ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత. వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంచాయన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్న నేపత్యంలో. గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు.

"నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఎన్నికలకు రావడానికి 15 రోజుల గడువ...