Hyderabad, జూలై 30 -- ఓటీటీల్లోకి ప్రతి నెలా ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ వస్తుంటాయి. వాటిలో కొన్నింటినే ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా జులై నెలలో వచ్చిన ఓ వెబ్ సిరీస్ దేశంలోని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి ఐఎండీబీలో ఏకంగా 8.5 రేటింగ్ రావడం విశేషం. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా అందుబాటులో ఉన్న సిరీస్ ఇది.

జులై నెలలో ఓటీటీల్లోకి వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ మిట్టి ఏక్ నయీ పెహచాన్ (Mitti Ek Nayi Pehchan). అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలోని కంటెంట్ మొత్తాన్ని ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. ఈ మిట్టి వెబ్ సిరీస్ కు ఐఎండీబీలో ఏకంగా 8.5 రేటింగ్ నమోదైంది. తన తాత గౌరవ మర్యాదలు నిలబెట్టడానికి లక్షల జీతం ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయంలోకి దిగే ఓ యువకుడి కథే ఈ మిట్టి.

వ్యవసాయంలో రైతులు ఎదుర్క...