భారతదేశం, జనవరి 23 -- ఈ నగరానికి ఏమైంది సినిమా టాలీవుడ్‌లో ఒక బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమాలోని నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిందే. ఆ ఫ్రెండ్స్ చేసిన అల్లరి, కామెడీ ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన చూడాలనిపిస్తుంది. అంతలా ఆ పాత్రలు ప్రతి ఫ్రెండ్షిప్ గ్యాంగ్‌ మనసుల్లో ముద్ర వేసుకున్నాయి.

ఆ పాత్రలకు అంతలా జీవం పోసింది అవి పోషించిన నటులు కూడా అని చెప్పుకోవచ్చు. అలాంటి పాత్రలో జీవించిన నటుడు మారిపోతే. అవును, ఇప్పుడు అదే జరిగింది. రీసెంట్‌గా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌ నుంచి కార్తీక్ పాత్ర పోషించిన సుశాంత్ రెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ నగరానికి ఏమైంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పంచుకున్నారు. సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఈ నగరానికి ఏమైంది 2 నుంచి వైదొలిగినట్లు తరు...