భారతదేశం, అక్టోబర్ 27 -- మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ నితిన్. ఇప్పుడు రామ్ నితిన్ నటించిన మరో కొత్త సినిమా జిగ్రీస్. ఈ సినిమాలో రామ్ నితిన్‌తోపాటు కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్‌ అథేర్య హీరోలుగా నటించారు.

యూత్‌ఫుల్ కామెడీ సినిమాగా తెరకెక్కిన జిగ్రీస్ మూవీకి హరీష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. అలాగే, ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై జిగ్రీస్ చిత్రాన్ని రూపొందించారు. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న జిగ్రీస్‌ చిత్రం రిలీజ్‌ డేట్‌ తాజాగా ఫిక్స్ అయింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జిగ్రీస్ నవంబర్ 14 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వస్తున్న జిగ్రీస్ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా చే...