భారతదేశం, జూన్ 29 -- యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి టాలీవుడ్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెటర్ గా నిలిచిన మూవీ 'ఈ నగరానికి ఏమైంది'. 2018లో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే అల్లరి, హంగామా వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ను పంచింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో థియేటర్లకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా రూ.12 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

ఈ నగరానికి ఏమైంది సినిమా 2018లో రిలీజైంది. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికీ ఫ్యాన్స్ నోళ్లలో నానుతూనే ఉంది. ఈ మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ ను రెడీ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్ పెట్టినప్పుడే ఫ్యాన్స్ లో ఉత్కంఠ మొదలైం...