భారతదేశం, జనవరి 22 -- 2018లో థియేటర్లలో రిలీజైన 'ఈ నగరానికి ఏమైంది' మూవీ ఎంతటి హిట్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమా యూత్ కు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ గోవా ట్రిప్ కామెడీతో పాటు డీప్ మెసేజ్ ను కూడా అందిస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్. అయితే పార్ట్ 2 నుంచి ఓ కీలక నటుడు తప్పుకొన్నాడు.

ఈ నగరానికి ఏమైంది రిపీట్ అనే టైటిల్ తో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తెరకెక్కించనున్నాడు తరుణ్ భాస్కర్. ఇప్పటికే పార్ట్ 2 అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ నగరానికి ఏమైంది మూవీ పార్ట్ 1లో కీలక పాత్ర పోషించిన సాయి సుశాంత్ రెడ్డి ఈ సీక్వెల్ కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అధికారికంగా వెల్లడించాడు.

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కు సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో...