Hyderabad, అక్టోబర్ 10 -- దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆనందంగా దీపాల మధ్య దీపావళి పండుగను జరుపుకుంటారు, టపాసులు కాల్చుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న, సోమవారం నాడు వచ్చింది. దీపావళి నాడు కొన్ని యాదృచ్చికం కూడా. దీపావళి నాడు ఈ యాదృచ్చికం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి.

ఈ ఏడాది దీపావళి చాలా ప్రత్యేకంగా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈ శుభ యోగాలు వేళ లక్ష్మీదేవిని ఆరాధించడం, కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వంటివి చేస్తే మంచిది. దీపావళి నాడు లక్ష్మీ పూజ చేయడం వలన డబ్బుకి లోటు ఉండదు. అందుకని వ్యాపారులు కూడా దీపావళి నాడు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

దీపావళికి శని తిరోగమనంలో ఉండడం ప్రత్యేకమని చెప్పాలి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది కొన్ని ర...