భారతదేశం, నవంబర్ 12 -- చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తున్నట్టుగా ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా రైల్వే బోర్డు ఏ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయో క్లారిటీ ఇచ్చింది. 12 జనవరి 2026 నుంచి వందే భారత్ సర్వీసులు నరసాపురం వరకు వెళ్తాయని సదరన్ రైల్వే ప్రకటించింది. దీనితో వందే భారత్ రైలు ద్వారా విజయవాడ చేరుకుని.. తర్వాత నరసాపురం వైపు జర్నీ చేసేవారికి ఉపశమనం కలగనుంది. నేరుగా నరసాపురం వరకూ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

ట్రైన్ నెంబర్ 20677 చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:30 గంటలకు బయలుదేరుతుంది. రేణిగుంట(7:10), నెల్లూరు(8:30), ఒంగోలు(9:45), తెనాలి(11:10), విజయవాడ(11:45), గుడివాడ(12:30), భీమవరం టౌన్(1:15), నర్సాపురం(2:10)కి చేరుకుంటుంది.

నర్సాపురం నుం...