భారతదేశం, డిసెంబర్ 7 -- శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ దేవస్థానం అధికారులు శ్రీశైలంలో ఆలయ యూనిట్ అధిపతులు, ఇంజనీరింగ్ అధికారులు, పర్యవేక్షకులు, వేద కమిటీతో ప్రాథమిక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. ఆ రోజు ప్రభుత్సవం, పాగా అలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం జరగనుందని ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్పారు. ఫిబ్రవరి 16వ తేదీన మల్లిఖార్జునస్వామి, అమ్మవారి రథోత్సవం ఉంటుంది. 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులు చర్చించారు.

దేవస్థానం అన్ని విభాగాలు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలను సజావుగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం, ట్రస్ట్ ...