భారతదేశం, డిసెంబర్ 18 -- ఏపీ ప్రభుత్వం, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) సహకారంతో ఫిబ్రవరి 13, 14, 2026 తేదీలలో విశాఖపట్నంలో రెండు రోజుల నేషనల్ టూరిజం మార్ట్-2025ను నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

దేశీయ పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందడానికి, పర్యాటక శాఖ సీనియర్ అధికారులు, ADTOI ప్రతినిధుల సమక్షంలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాష్ట్రంలో కోస్టల్ టూరిజం, ఆధ్యాత్మిక సర్క్యూట్‌లు, వారసత్వ కట్టడాలు, పర్యావరణ-సాహస పర్యాటకం, ఏజెన్సీ (గిరిజన) ప్రాంత పర్యాటకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, డెస్టినేషన్ ప్రమోటర్లు, ప...