భారతదేశం, నవంబర్ 7 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. కొంతమంది ఏ పనినైనా పూర్తి చేస్తారు. బద్ధకం లేకుండా, ఏకాగ్రతతో అన్నింటినీ సులువుగా పూర్తి చేస్తారు.

కొంత మందికి ఏ పని అయినా కష్టంగా ఉంటుంది, అంత ఈజీగా సాల్వ్ చేయలేరు. కాస్త టైం తీసుకుంటారు, ఓపికతో చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ పనినైనా క్షణాల్లో పూర్తి చేస్తారు. పైగా ఏ పని వారికీ కష్టంగా అనిపించదు. తెలివిగా, చురుకుగా ఉంటారు. ...