భారతదేశం, జనవరి 8 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే, మొత్తం రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. అలాగే ప్రతి సంఖ్యకు కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఈ రోజు రాడిక్స్ సంఖ్య 7కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 7 అవుతుంది. వారు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఎలాంటి ప్రమాదాన్ని అయినా సరే ముందుగానే అంచనా వేయగల అద్భుతమైన శక్తి వీరికి ఉంటుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు కావడంతో, జీవితం ఎంత కఠినమైన దశలో ఉన్నా కూడా ధైర్యాన...